అమరావతి సచివాలయంలో ట్రైబల్ సెక్రటరీ ఆఫీస్ నందు ట్రైబల్ సెక్రెటరీ మల్లికార్జున్ నాయక్ ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వెనుకబడిన ఏజెన్సీ నియోజకవర్గం పోలవరం కావున నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ కల్పనకు, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.