ఏలూరు పార్లమెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుని ఏలూరు ఎంపీ మహేష్ కోరారు. శుక్రవారం రాజధాని అమరావతి సచివాలయం బ్లాక్ నంబరు-1లో సీఎంను స్వయంగా కలిసి నాయీబ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపు, కుక్కునూరు మండలంలో విద్యుత్ సమస్య, పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదల, పొగాకు రైతుల సమస్యలను వివరించారు.