కొయ్యలగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

63చూసినవారు
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం శివారు నీలాలమ్మ గుడి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి రహదారి పక్కన ఉన్న మార్జిన్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎర్రంపేట గ్రామానికి చెందిన రాపాక పండు (27) తీవ్ర గాయాలు కావడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్