వేలేరుపాడు మండలంలోని వరద బాధితులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరామర్శించారు. వరదలకారణంగా కూలిపోయిన ఇళ్లు, ఇతర నష్టాలు వంటి వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందించాలని, వెంటనే బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.