అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ. 2కోట్ల, 23లక్షలను ఇవ్వకుండా మోసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుతో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ కె. హబీబ్ విచారణకు పోలవరం వచ్చారని ఎవో కే. రాంబాబు బుధవారం తెలిపారు. మండలంలోని గత రబీ సీజనకు 136మంది రైతుల వద్ద మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసుకున్న పన్నూరి సూరిబాబు సొమ్ము చెల్లించకుండా రైతులను మోసం చేశారని అన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేలా చూస్తానన్నారు.