జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్ అధికారులు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొప్పుల చెరువు గట్టున 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి 5 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీను బాబు, ఎస్సై సుబ్రహ్మణ్యం నేతృత్వంలో సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.