జీలుగుమిల్లీ మండలం పి. అంకంపాలెంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన జయవరపు గణేశ్ కుటుంబం రెండు రోజుల క్రితం బాసర దేవాలయానికి వెళ్లారు. సోమవారం ఉదయం బంధువులు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న నగదు, బంగారం మాయమైనట్లు తెలిపారు. పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.