జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొని కారు పంట పొలాల్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అది వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.