సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు జీలుగుమిల్లి మండలంలోని బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకు సీఎం సహాయ నిధి చాలా ఉపయోగపడుతుందని, పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు.