జీలుగుమిల్లి: జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

81చూసినవారు
ఈనెల 14న పిఠాపురం చిత్రాడలలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ఈ సందర్భంగా గురువారం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీర మహిళలు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్