ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దర్భగూడెం గ్రామానికి చెందిన పైడి మర్ల సోమిరెడ్డి(70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటే క్రమంలో లారీ అతివేగంగా రావటంతో ఈ ఘటనా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.