జీలుగుమిల్లి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

68చూసినవారు
జీలుగుమిల్లి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జీలుగుమిల్లి మండలంలోని దర్భ గూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి ధర కిలోకు రూ. 330 వరకు వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్