కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్, జలజీవన్ మిషన్లో భాగంగా ₹. 24. 58 లక్షల అంచనా వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందే ఉద్దేశంతో జల జీవన మిషన్లో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.