కొయ్యలగూడెం మండలం కన్నాపురం అటవీ శాఖ అధికారులు సోమవారం మారుజాతి పుల్లను తరలిస్తున్న రెండు వాహనాలను అదుపులోకీ తీసుకున్నారు. ఈ సందర్భంగా గోకవరం నుండి కొయ్యలగూడెం వెళుతున్న బడ దోస్త్ వాహనాన్ని, తుని నుండి కొయ్యలగూడెం వైపు వెళుతున్న ఒక లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుమారు 60000 విలువ గలిగిన మారుజాతి పుల్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.