సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని శనివారం కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పారేపల్లి నరేష్ పాల్గొన్నారు.