కొయ్యలగూడెం: మూడు లారీలు సీజ్

51చూసినవారు
కొయ్యలగూడెం: మూడు లారీలు సీజ్
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం రేంజ్ పరిధిలో మంగళవారం రాత్రి ఫారెస్ట్ అధికారుల వాహన తనిఖీలు నిర్వహించారు. పేరుపాలెం నుంచి కొయ్యలగూడెం మండలానికి 3 లారీలలో మారుజాతి కలపను అక్రమంగా తరలిస్తుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి దినేష్, సిబ్బంది పట్టుకున్నారు. కలప విలువ లక్ష రూపాయల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. మూడు లారీలను స్వాధీన పరుచుకొని రేంజ్ కార్యాలయానికి ఫారెస్ట్ అధికారులు తరలించారు.

సంబంధిత పోస్ట్