కుక్కునూరు: లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

75చూసినవారు
కుక్కునూరు: లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
ఏలూరు జిల్లా కుక్కునూరు-భద్రాచలం ప్రధాన రహదారిలో గురువారం పాలవాగు వద్ద లారీ బోల్తా పడడంతో డ్రైవర్‌ చరణ్‌ప్రీత్‌ సింగ్‌ (50) మృతి చెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు చెన్నై నుంచి రాయ్‌పూర్‌కు డోజర్‌తో క్యాట్‌ వెహికల్‌ వెళుతుండగా పాలవాగు వద్ద అదుపు తప్పిన లారీ బోల్తాపడింది. డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కు పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో డ్రైవర్‌ మృతదేహాన్ని వెలికితీశారు.

సంబంధిత పోస్ట్