కుక్కునూరు మండలం కుమ్మరిగూడెంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఏర్పాటు చేసిన ఎర్త్ వైర్ తగలడంతో గురువారం ఓ ఆవు మృతి చెందింది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.