బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుక్కునూరు గ్రామానికి చెందిన నాగ శ్రీనివాస్ ఆదివారం బైకుపై పొలం వెళ్తుండగా బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. నాగశ్రీనివాస్ కు తలకు తీవ్ర గాయమైంది. భద్రాచలం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.