కుక్కునూరు మండలం వింజరం పంచాయతీ బర్లమడుగు గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఇంట్లోని సామాన్లు కాలి బూడిదయ్యాయి. కట్టు బట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.