ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తల్లి మల్లమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం బాలరాజును వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫోన్ లో పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాలరాజు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా వచ్చే నెలలో ఇంటికి వస్తానని పేర్కొన్నారు.