పోలవరం: జాలర్లకు చిక్కిన అరుదైన రొయ్య

58చూసినవారు
పోలవరం: జాలర్లకు చిక్కిన అరుదైన రొయ్య
పోలవరం గోదావరిలో వేటకి వెళ్లిన జాలర్లకు అరుదైన రెండు నీలగంటి రొయ్యలు లభ్యమయ్యాయి. ఆదివారం మార్కెట్‌లో ఒక్కోటి అర కిలో బరువుతో రూ.200కి అమ్మారు. అవి బతికి ఉండి గర్భంతో ఉంటే ధర లక్షల్లో ఉండేదని, కానీ చనిపోవడంతో తక్కువ ధరకే విక్రయించామన్నారు. రొయ్యల చెరువులు రైతులకు ఎంతో ఉపయోగకరమని కూడా తెలిపారు. ఈ అరుదైన రొయ్యలను స్థానికుడు కోటి చుక్కల సుబ్రహ్మణ్యం కొనుగోలు చేశాడు.

సంబంధిత పోస్ట్