ఏపీ క్రీడా సాధికార సంస్థ బోర్డు సభ్యురాలిగా కొవ్వాసి జగదీశ్వరిని ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. జగదీశ్వరి పోలవరం మండలం చేగొండపల్లి గ్రామానికి చెందిన వారు కాగా, జగదీశ్వరితో పాటు మరో ఏడుగురుని రెండేళ్ల పదవి కాలానికి శాప్ బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. క్రీడారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జగదీశ్వరి తెలిపారు.