
87 మద్యం షాపులకు దరఖాస్తులు నిల్
AP: రాష్ట్రంలో కల్లు గీత కులాలకు ప్రభుత్వం 335 మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే. వీటికి బుధవారం వరకు 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గతంలో 20శాతం మార్జిన్ ఉండేది. కూటమి ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.