మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటినే అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.