కుక్కునూరు సిఐ రమేష్ సిబ్బందితో కలిసి బుధవారం కుక్కునూరు మండలం సీతారామనగరం శివారులో నది ఒడ్డున నాటు సారా తయారీ స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారా ఉపయోగించే అల్యూమినియం సామాన్లు స్వాధీనపరుచుకున్నారు. పచ్చని ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు అనారోగ్యం కలిగించే నాటు సారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.