ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వర్షానికి కాలేజీ రోడ్డు, గణేశ్ నగర్ వద్ద వృక్షాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. అలాగే వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.