పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పోలవరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఎం నేతలు మాట్లాడారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలను అమలు చేయాలని, గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు.