పోలవరం: మద్యం సీసాల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా

77చూసినవారు
ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ-పాత పట్టిసీమ మధ్యలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొవ్వూరు డిపో నుంచి పోలవరం మద్యం దుకాణానికి మద్యం తరలిస్తున్న మినీ లైలాండ్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని మద్యం సీసాలు ధ్వంసం అయ్యాయి. ధ్వంసమైన మద్యం విలువ దాదాపు రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

సంబంధిత పోస్ట్