పోలవరం మండలం కుంకాల గ్రామానికి చెందిన నిండుగర్బిని థామస్ శిరీష (24) బుధవారం మృతి చెందింది. మంగళవారం రాత్రి పురిటి నొప్పులతో పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో సరైన వైద్యం అందకపోవడంతో ఆమె మరణించినట్టు బంధువులు ఆరోపించారు. సకాలంలో వైద్యసేవలు అందించకపోవడమే మృతికి కారణమని వారు ఆరోపించారు.