జూన్ 9న పోలవరం మండలం బొరంపాలెంలో మలేరియా మాసోత్సవం సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా. ఏ.ఎం. ఆంజనేయులు, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ మలేరియా తీవ్రమైన వ్యాధి అని, పరిశుభ్రత, సరైన పారిశుధ్యం, అవగాహనతో దీన్ని నివారించొచ్చన్నారు. అనుమానం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. మలేరియా రహిత భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేశారు.