రామన్నగూడెంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే చిర్రి

82చూసినవారు
రామన్నగూడెంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే చిర్రి
టీ. నర్సాపురం మండలం రామన్నగూడెంలో శుక్రవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లు, తాగునీరు, పక్కా గృహాల సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రామన్నగూడెంలో సమస్యలను గుర్తించి తనకు నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే అధికారులను ఫోన్లో ఆదేశించారు. త్వరితగతిన టెండర్లు పిలిచి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్