తాడేపల్లిగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

83చూసినవారు
తాడేపల్లిగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నేడు దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ఒక దిక్సూచిగా పనిచేస్తుందని ఆయన అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు.

సంబంధిత పోస్ట్