రైలుపట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

77చూసినవారు
రైలుపట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి
చేబ్రోలు-పుళ్ళ రైల్వే స్టేషన్ల మధ్య రైలుపట్టాలపై ఆదివారం 45-50ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు తాడేపల్లిగూడెం జీఅర్‌పీ హెడ్ కానిస్టేబుల్ డి. వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు నలుపు, నీలం, తెలుపు రంగులతో చిన్నచిన్న గడుల కలిగిన లుంగీ, తెలుపురంగు టవలు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్