తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో బుధవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ పాడి పశువులకు సకాలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలన్నారు. లేకుంటే పాల దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. 450 పాడి పశువులకు టీకాలు వేశారు. పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు.