పడాల గ్రామాన్ని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కలపొద్దని ఉపాధి హామీ పథకం శ్రామికులు కోరారు. సోమవారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోమరాజు పరిశీలించి, శ్రామికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు సంవత్సరాలుగా ఉపాధి పనులు లేక ఇబ్బందులు పడ్డామని శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దని వారు విజ్ఞప్తి చేశారు.