తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులు అధికారులు చేపట్టారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు మరమత్తు పనులు మంగళవారం చేపట్టారు. రూ. 9. 12 లక్షల వ్యయంతో తాడేపల్లిగూడెం ప్రధాన కూడలి మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా పనుల ప్రగతిని మంగళవారం పర్యవేక్షించారు.