తాడేపల్లిగూడెంలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

70చూసినవారు
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న 9 మంది ముఠాను అరెస్ట్ చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామానికి చెందిన పులపాక సాంబశివ, మరో ఎనిమిది మంది ఈ నేరానికి పాల్పడ్డారన్నారు. వారి వద్ద నుంచి రూ. 1. 76లక్షల విలువైన 352 నకిలీ రూ. 500లు కరెన్సీ నోట్లు సీజ్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్