తాడేపల్లిగూడెంలో భారీ వర్షం

51చూసినవారు
తాడేపల్లిగూడెంలో భారీ వర్షం
తాడేపల్లిగూడెంలో బుధవారం భారీ వర్షం కురిసింది. పట్టణ ప్రజలు ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. 9:30 గంటల ప్రాంతం నుంచి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఒక దశలో చిన్నపాటి చినుకులతో వర్షం నిలిచింది. 10:30 గంటల నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ తడిసి ముద్దయ్యాయి.

సంబంధిత పోస్ట్