పెంటపాడులో 144 సెక్షన్ విధింపు

4938చూసినవారు
పెంటపాడు మండలం రావిపాడులో అంబేడ్కర్ విగ్రహం విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ మేరకు తహశీల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ రెండు వారాల పాటు గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. అప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్