జగన్నాథపురం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

84చూసినవారు
జగన్నాథపురం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తాడేపల్లిగూడెం పరిధిలోని జగన్నాథపురం సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రామంలో యోగా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రరాజు, కూటమి నాయకులు రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్