జంగారెడ్డిగూడెంలో చిన్నారులను చిత్రహింసలు పెట్టిన మారు తండ్రి పవన్ కుమార్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ కార్యాలయంలో డిఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ శారద అనే మహిళ తన భర్తతో విభేదాలు వచ్చి విడిగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో పవన్ అనే వ్యక్తితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. వారి ఏకాంతానికి పిల్లలు అడ్డువస్తున్నారని చిత్రహింసలు పెట్టారన్నారని డిఎస్పీ తెలిపారు.