ఇంటిని నిర్మించి ఇవ్వాలని వేడుకుంటోంది కైకరానికి చెందిన 80 ఏళ్ల కాంతమ్మ. ఆమె మాట్లాడుతూ శనివారం మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయాడని తనకు పిల్లలు ఎవరూ లేరని తెలిపింది. నివసిస్తున్న పూరి గుడిసె గుంజలు ఊడిపోయి ఎప్పుడు కూలిపోతుందోనని భయంగా ఉందని వాపోయింది. వార్డు మెంబర్ నత్త వెంకటేశ్వరరావు రెండు పూటలా భోజనం ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది. అధికారులు స్పందించి గూడు ఏర్పాటు చేయాలని వేడుకుంటుంది.