జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంశ్రీ రాజా జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఫ్లెక్సీలను నిషేధించారు. వివరాల్లోకి వెళితే శనివారం జరగనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఫ్లెక్సీలను నిషేధించి వైట్ క్లాత్ లతో పాతకాలం నాటి చేతిరాతలతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే మామిడి తోరణాలతో, అరటి గెలలతో, కొబ్బరి మట్టలతో ఆర్భాటంగా రేపు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.