వీరంపాలెంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
By Gopi, Sr Reporter 79చూసినవారుతాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆకాశ లింగానికి జరిగిన అభిషేకాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ, డి. ఎస్. పి ప్రభృతులు దర్శించుకున్నారు. పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి, శశి పర్యవేక్షించారు.