అప్పారావుపేట, మాధవరంలో ఎఫ్పిఓ సభ్యుల సమావేశం

71చూసినవారు
అప్పారావుపేట, మాధవరంలో ఎఫ్పిఓ సభ్యుల సమావేశం
కృషి అమృత్ భారత్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా అప్పారావుపేట, మాధవరం గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ కొండపల్లి నగేష్ తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం పోలేరమ్మ ఆలయం వద్ద ఎఫ్పిఓ సభ్యుల సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు జేసీ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దళారీ వ్యవస్థను నివారించేందుకు ఏర్పాటు చేసామన్నారు. సింధు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్