తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో రెండు హైదరాబాద్ సర్వీస్ బస్సులను శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి, సర్వీస్ ప్రారంభించారు. అనంతరం వాహనం నడిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ బస్సులను ప్రజలకు అంకితం చేశారు ఎమ్మెల్యే బొలిశెట్టి. అవకాశం కల్పించిన ఆర్టీసీ యాజమాన్యానికి, డిపో మేనేజర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.