ప్రతి జిల్లాలో మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తూ రజక యువతను సంఘాల్లో బలోపేతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసి బాబు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం పెంటపాడు లో ఆయన మాట్లాడారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, గ్రామస్థాయి నుండి రజక సంఘాలను బలోపేతం చేస్తూ మన హక్కులను సాధించుకోవాలంటే రజకులందరూ ఐకమత్యంగా ఉండాలన్నారు.