నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

70చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
వార్షిక తనిఖీలు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో బుధవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. గాంధీ బొమ్మ కూడలి, గణేశ నగర్, వానపల్లిగూడెం, మామిడితోట, హౌసింగ్ బోర్డు, వీకర్స్ కాలనీ, ప్రాంతీయ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్