పారిశుద్ధ్య మెరుగుకు కచ్చా డ్రెయిన్లు

81చూసినవారు
పారిశుద్ధ్య మెరుగుకు కచ్చా డ్రెయిన్లు
గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుకు కచ్చా డ్రైన్లు తీయిస్తున్నట్లు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు జగత్ సోమశేఖర్ తెలిపారు. మంగళవారం పెంటపాడు
మండలం ప్రత్తిపాడు బీసీ కాలనీలో రోడ్లపై మురుగు నిలిచిపోవడంతో జేసీబీ సహకారంతో కచ్చా డ్రైనేజీ తవ్వకం పనులు చేపట్టారు. స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో జేసీబీ పంపినట్లు తెలిపారు. రాంబాబు, అంజి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్